calender_icon.png 11 September, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుద్రమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా కృషి చేస్తా

11-09-2025 03:21:43 PM

రుద్రమ్మ చెరువు, మరో... లక్నవరంగా మారనున్నది

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

తుంగతుర్తి (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి రుద్రమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా మార్చుటకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం వెలుగు పల్లి శివారులో గల రుద్రమ్మ చెరువును పర్యాటక అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి పురాతనమైన చెరువు అని, సుమారు 600 పై చిలుకు విస్తీర్ణతతో చెరువు నిండి ఉన్నదని, చెరువు మధ్యలో చెరువు పక్కల పెద్ద పెద్ద గుట్టలు ఆనుకొని ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి, పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్నందువల్ల, రుద్రమ చెరువును తీర్చిదిద్దితే మరో లక్నవరంగా మారనున్నట్లు తెలిపారు. చెరువులో బోటు, గుట్టల వద్ద స్టాల్స్ తో అందంగా తీర్చిదిద్దే బాగుంటుందని అధికారులకు సూచించి, సంబంధిత ఈ డి ఫోన్లో ఉపేందర్రెడ్డి తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానందం, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఎల్సోజి నరేష్, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల, మల్లేష్, దాసరి శ్రీను, కొండరాజు, మాచర్ల అనిల్, గంగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.