calender_icon.png 11 September, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా బస్తా కావాలి అంటూ రోడ్డెక్కిన రైతులు

11-09-2025 03:16:43 PM

ఏడిఏ రాధిక పై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ 

చేర్యాల: యూరియా కోసం చేర్యాల జాతీయ రహదారిపై(National Highway) రైతులు బైటయించడం వలన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.గత రెండు రోజుల క్రితం యూరియా పక్కదారి పడుతుందని రైతులు ధర్నా చేయగా ఆలా జరగకుండా చూసుకుంటా అని చేర్యాల ఏడిఏ రాధిక రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.ఐనా కూడా యూరియా పక్కదారిన పోతుండటంతో గతిలేని పరిస్థితులలో మల్లి ఆందోళన చేయవలసి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా బస్తాలు(Urea bags) కావాలి అని ఏడిఏ రాధికను అడిగితె ఆమెకు ఇష్టం వచ్చినట్లు మాటాడుతున్నదని మీరు మా రైతులకోసం పనిచేయాలిసింది  పోయి మామీదనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకా  మీకు దిక్కున చోట చెప్పుకోండి అంటు అంటున్నదని రైతులం ఆవేదనతో రోడ్డు ఎక్కామని అన్నారు.యూరియా పక్క దారి పట్టడంలో ఏఓ భోగేశ్వర్ పై చర్యలు తీసుకోకుండా ఆయనకు సహకరిస్తున్న ఏడిఏ రాధిక పైన ఉన్నతధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందరికి అందేవిధంగా చూడాలని కోరినారు.ఆందోళనకు దిగిన రైతులతో చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్ చేర్యాల సిఐ శ్రీను మాట్లాడి ఆందోళన విరమింప చేశారు.