calender_icon.png 11 September, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దడ పుట్టిస్తున్న నల్లగొండ ఫోక్సో కోర్టు.!

11-09-2025 02:08:02 PM

నిందితుడికి 21 సంవత్సరాలు జైలు శిక్ష, 30000 జరిమానా  

న్యాయమూర్తి రోజారమణికి సోషల్ మీడియాలో ప్రశంసలు 

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): వరుసగా కఠిన తీర్పులతో కామాంధులకు నల్లగొండ ఫోక్సో కోర్టు(Nalgonda POCSO Court) దడ పుట్టిస్తుంది. దీంతో న్యాయమూర్తి రోజా రమణికి సోషల్ మీడియాలో ప్రశంసలు  వెల్లువెత్తుతున్నాయి. 2019లో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన కట్టంగూరు గ్రామానికి చెందిన జడిగల హరీష్‌కు గురువారం న్యాయమూర్తి రోజా రమణి 376(2)(I) సెక్షన్ కింద 21 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధించారు. ఈ కేసులో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీసులు సమర్పించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ కీలకంగా మారింది.