calender_icon.png 26 July, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేంకటేశ్వరుడికి మంత్రి శ్రీధర్‌బాబు పూజలు

26-07-2025 01:19:17 AM

స్వామిజీలతో చర్చలు

శేరిలింగంపల్లి, జూలై 25: చందానగర్ డివిజన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ సముదాయంలో విశాఖ శారదా పీఠాధిపతి జగద్గురు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారిని, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారిని మంత్రి మర్యాద పూర్వకంగా కలిశారు.

మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి ఉన్నా రు. స్వామిజీల ఆశీర్వచనాలు తీసుకొని, ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. వారివెంట రఘునాథ్‌రెడ్డి, మిరియా ల రాఘవరావు, సుభాష్, సుప్రజ ప్రవీణ్, ఉరిటీ వెంకట్రావు ఉన్నారు.