26-07-2025 01:18:41 AM
మహిళా దక్షతా సమితి స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ముషీరాబాద్, జూలై 25 (విజయ క్రాంతి) : నర్సులే సమాజానికి అదృశ్య శక్తులని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శుక్ర వారం మహిళా దక్షతా సమితి(ఎండీఎస్) విద్యా సంస్థలు, బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రుల నాలుగో స్నాతకోత్సవం నగరంలో ఘనంగా నిర్వహించినట్లు ఎండీఎస్ అధ్యక్షురాలు డాక్టర్ సరోజ్ బజాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేవలం డిగ్రీలు తీసుకోవడమే కాదు, సాధికారతతో కూడిన మహిళలుగా సమాజానికి చికిత్స చేయడానికి అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. ఆర్జీవీ ఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిస్త్ ఐపిఎస్ మాట్లాడుతూ నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదని, అదో దైవకార్యం లాంటిదన్నారు.