calender_icon.png 27 July, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో డ్రైవింగ్

26-07-2025 01:20:26 AM

ఇద్దరికి స్వల్ప గాయాలు

మేడ్చల్, జూలై 25 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంబిపూర్‌లో గురువారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తుతో పాటు నిద్రమత్తుతో డ్రైవింగ్ చేయడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కన ఉన్న ఇంటి ప్రహరీపైకి ఎక్కింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉన్నారు. వారికి స్వల్ప గాయాలు అయ్యా యి.

భారీ శబ్దం రావడంతో ఇంటివారితో పాటు చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై బయటకు వచ్చారు. అర్ధరాత్రి కావడం వల్ల రోడ్డుపై ఎవరూ లేనందున పెద్ద ప్రమా దం తప్పింది. స్థానికుల సమాచారంతో శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందకు దించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.