calender_icon.png 6 February, 2026 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యజ్ఞ యాగాలు మానవళి సుభిక్షతకు తోడ్పడతాయి

05-02-2026 04:25:04 PM

మంథని లో సంపూర్ణ యజుర్వేద స్వాహాకార యజ్ఞం లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఫిబ్రవరి 05(విజయక్రాంతి): యజ్ఞ యాగాలు సమస్త జీవులను సుభిక్షంగా ఉంచడానికి తోడ్పడతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురువారం మంథని పట్టణంలోని  శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న సంపూర్ణ యజుర్వేద సహకార యజ్ఞంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ఆమ్నాయ వర్ధిని సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరసిల్లుతున్న మంత్రపురిలో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం  నిర్వహిస్తుండడం సంతోషకరమన్నారు.

శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయాల పునరుద్ధరణకు త్రికరణ శుద్ధితో కృషి చేస్తున్న లోకే మనోహర్ లోకే శరత్ లను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం వేద పండితులు మంత్రి శ్రీధర్ బాబును శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. ఈనెల 2 నుండి 7 వరకు శ్రీ గాయత్రి జప సహిత కృష్ణ యజుర్వేద క్రమ పారాయణ పూర్వక సంపూర్ణ కృష్ణ యజుర్వేద సహకార యజ్ఞము ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు  అచలాపురం దుద్దిల్ల మనోహర్ శర్మ, వోజ్జల గణేష్ శర్మ ఆధ్వర్యంలోని శ్రీ ఆమ్నాయ  వర్ధిని సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.