calender_icon.png 6 February, 2026 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరికి గురైన ఫోన్ లు బాధితులకు అందజేత

05-02-2026 04:23:27 PM

పాపన్నపేట,ఫిబ్రవరి 5:చోరికి గురైన మొబైల్ ఫోన్ లు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 13 ఫోన్ లను గురువారం ఠాణాలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో 475 ఫోన్ లు చోరికి గురికాగా ఇప్పటి వరకు 439 చరవాణిలను బాధితులకు అందించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ లను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు.