మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు
10-05-2026 12:00 AM
- గ్రామ దేవతలు ఆశీస్సులు తీసుకున్న మంత్రి
- సూరయ్యపల్లిలో వైభవంగా బొడ్రాయి స్థిర ప్రతిష్ఠ
మంథని, మే 9(విజయక్రాంతి): మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామంలో నిర్వహించిన భూలక్ష్మి, మహాలక్ష్మి, సహిత బొడ్రాయి స్థిర ప్రతిష్ఠ పోచమ్మ కొలుపు కార్యక్రమంలో శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబుకి గ్రామ సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈకార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






