సత్తుపల్లిలో న్యూజెనెసిస్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల
31-08-2026 12:09 AM
సత్తుపల్లి ఆగస్టు 30. ( విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణములోని పాత సెంటర్లో యుపిఎస్ స్కూల్ రోడ్లో న్యూ జెనెసిస్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు దిన దినాభివృద్ధి చెందుతున్న సత్తుపల్లి పట్టణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలో అందించి ప్రజల మనలను పొందాలని ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి తుమ్మల హాస్పిటల్ యాజమాన్యానికి తెలిపి న్యూ జెనెసిస్ మల్టీ స్పెషాలిటీ యాజమాన్యానికి తన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల తో పాటు సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు తుమ్మల అభిమానులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






