ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడిన మంత్రి తుమ్మల
01-09-2024 07:14 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం మాట్లాడారు. మున్నేరు వరద బాధితుల కోసం తుమ్మల హెలికాప్టర్ల సాయం కోరారు. కాసేపట్లో ఖమ్మం మున్నేరు వద్దకు హెలికాప్టర్లు చేరుకోనున్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశాఖలోని నేవీ అధికారులతో మాట్లాడారు. ఖమ్మం నగరానికి నేవీ హెలికాప్టర్లను పంపించాలని భట్టి విక్రమార్క కోరారు. కాసేపట్లో విశాఖ నుంచి ఖమ్మం రెండు హెలికాప్టర్లు చేరుకోనున్నాయి.






