7 May, 2026 | 2:16 AM

కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న శ్రీశైలం రహదారి

01-09-2024 03:29 PM

నాగర్‌కర్నూల్‌: ఈగలపెంట సమీపంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా మన్ననూర్ నుండి శ్రీశైలం వరకు రహదారి పరిస్థితిపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్ నుండి వచ్చే ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ పరిస్థితులు మెరుగుపడి వర్షాలు ఆగే వరకు శ్రీశైలం పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు.