కేంద్రం అసమర్థత వల్లే యూరియా సరఫరాలో కొరత
25-08-2025 03:56 PM
హైదరాబాద్: యూరియా పంపిణీపై వ్యవసాయ డైరెక్టర్ కు సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) ఆదేశించారు. ఈ సందర్భంగా డిమాండ్ కు అనుగుణంగా జిల్లాలకు యూరియా పంపాలని ఆయన వ్యవసాయ డైరెక్టర్ కు ఆదేశాలు పంపారు. అలాగే ఈ వారంలో 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా రాష్ట్రానికి చేరుకుంటుందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి చేయడం వల్లే రాష్ట్రానికి యూరియా సరఫరా జరిగిందని, కేంద్రం అసమర్థత వల్లే యూరియా సరఫరాలో కొరత వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం వైఫల్యాలను మాపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, రైతులకు 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ జరుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు.






