25-08-2025 06:06:04 PM
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ఓ పుజారిని మోసం చేసి రూ. 6 లక్షలు కాజేసిన సంఘటన పురానాపూల్ లో చోటుచేసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన నివేదికల ప్రకారం, సికింద్రాబాద్ మిలటరీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించిన నేరగాళ్లు.. కర్నల్ సర్ ఆరోగ్యం బాగాలేదని, వారి కోసం పూజలు చేయాలని చెప్పారు. 11 రోజుల పూజల కోసం 21 మంది పురోహితులు కావాలని నేరగాళ్లు తెలియజేశారు. పూజలు నిర్వహించడానికి అడ్వాన్స్ కింద రూ. 3 లక్షలు పురోహితుడికి ఇస్తామని నేరగాళ్లు నమ్మించారు. బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ కోసమంటూ రూ. 10 పంపిన నేరగాళ్లు.. మిగతా డబ్బులు పంపుతామంటూ డెబిట్ కార్డు, పిన్ వివరాలు తీసుకున్నారు. పురోహితుడి బ్యాంక్ నుంచి విడతల వారిగా రూ. 6 లక్షలను నేరగాళ్లు కాజేశారు. మోసపోయిన సదరు పురోహితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.