06-08-2025 09:20:47 AM
హుజూర్ నగర్: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైద్రాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సమీక్ష సమావేశం నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ లతో కలిసి రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ...గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో నీటిపారుదల శాఖను నిర్వీర్వం చేశారన్నారు.
రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పనుల్లో నాణ్యత పాటించాలన్నారు.రైతుల అభ్యున్నతకై నిరంతరం ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నాలుగు భారీ నీటి ప్రాజెక్టులలో నీరు నిండుకుండలా ఉందన్నారు.కోదాడ నియోజకవర్గంలో రెడ్లకుంట లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 4460 ఎకరాలకు 47.64 కోట్ల రూపాయలతో పాలేరు వాగుపై నిర్మాణం జరుగుతుందని, రాజీవ్ శాంతి నగర్ లిప్ట్ ఇరిగేషన్ ని 54.03 కోట్ల రూపాయలతో 5000 ఎకరాలకి పాలేరు వాగు ద్వారా నిర్మాణం, ఆర్ 9లిప్ట్ ఇరిగేషన్ మునగాల,నడిగూడెం మండలాలకి చెందిన 3500 ఎకరాలకి 8.45 కోట్లతో నిర్మాణం,మోతే లిప్ట్ ఇరిగేషన్ 244 కోట్ల రూపాయలతో 45,736 ఎకరాలకి 4.5 టిఎంసిల సాగునీరు సరఫరా చేయటం జరుగుతుందని,పులిచింతల ప్రాజెక్టు జల విద్యుత్ నీటిని వృధా చేయకుండా రైతులకు ఉపయోగపడే ముక్తాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ స్కీం మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో 1450 కోట్ల రూపాయలతో 53వేల ఎకరాలకి సాగునీరు అందించడం జరుగుతుందని ఇప్పటికే 188.32 ఎకరాలకి భూ సేకరణ చేసి నష్ట పరిహారం అందించటం జరిగిందని జూలై 2026 నాటికి పూర్తి చేయాలని,పైపుల నిర్మాణంలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు.
పాలకీడు మండలంలో జవహర్ జానపహాడ్ లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 10,000 ఎకరాలకి 302.20 కోట్లతో డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కోమటికుంట, గుండ్లపహాడ్ చెరువులకి నీరు వచ్చేలా కాలువ ఏర్పాటు కి పరిశీలించాలని అధికారులకు సూచించారు.బెట్టే తండా లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 2041 ఎకరాలకి 26.02 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని జానపాడు, బెట్టేతండా లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం పూర్తి జరిగితే శాశ్వతంగా నీరు అందించి పాలకీడు మండలం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. నక్కగూడెం లిప్ట్ ఇరిగేషన్ 3200 ఎకరాలకి నీరు అందించేందుకు 31 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పులిచింతల ద్వారా విద్యుత్ తయారీ చేసిన నీటి ద్వారా రాజీవ్ గాంధీ లిప్ట్ ఇరిగేషన్ ద్వారా మేళ్లచెర్వు,కోదాడ, చిలుకూరు, చింతలపాలం మండలాలకి చెందిన 14100 ఎకరాలకు 320 కోట్లతో నిర్మించటం జరుగుతుందని తెలిపారు.
మహంకాళిగూడెం,మంచ్య తండా ఎత్తి పోతల పథకాలకి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ చెరువు సర్వే చేసి కబ్జాలో ఉన్నవారిని తొలగించి సరిహద్దులు గుర్తించాలని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు స్మాల్,మీడియం లిప్ట్ ఇరిగేషన్ లు నిర్మిస్తున్నామని రైతుల నుండి సేకరించిన భూములకి నష్ట పరిహారం అందిస్తున్నామని,పైపులు భూమి లోపటి నుంచి వేసి పైన సాగు చేసుకోవచ్చు అని భూ సేకరణ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతులను ఒప్పించాలని ఆదేశించారు.కోదాడ బస్సుస్టాండ్ ఆధునికరణ బస్సుస్టాండ్ గా నిర్మించుటకి 16.89 కోట్లు,హుజూర్ నగర్ బస్సుస్టాండ్ కొరకు 3.52 కోట్లతో మంజూరు చేశామని పంద్రాగస్టున కోదాడ,హుజూర్ నగర్ ఆధునికరణ బస్ స్టాండ్లకి శంకుస్థాపన చేస్తామని అధికారులు ఏర్పాటు చేయాలని ఆరునెలల లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందిస్తూ,పార్కింగ్, కాంటీన్, ఏసి వెయిటింగ్ హల్, పిడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.గడ్డిపల్లి,చిలుకూరు యంగ్ ఇండియా రెసిడెన్సీ యల్ పాఠశాలకి రోడ్లకి అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేయాలన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గంలో 315.10 కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని,46.70 కోట్లతో ఆరు బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని, హుజూర్ నగర్ పట్టణంలో 8 కోట్లతో ఆర్అండ్బిగెస్ట్ హౌజ్ నిర్మిస్తున్నామని,డిఎంఎఫ్ టి 20.44 కోట్లతో వివిధ పనులు చేపడుతున్నామని,పాలకీడు,చింతలపాలెంలో ప్రభుత్వ కార్యాలయాలు,కోదాడ నియోజకవర్గంలో 228.40 కోట్లతో రోడ్ల నిర్మాణం, 8 కోట్లతో మునగాల కొక్కిరేని బ్రిడ్జి నిర్మిస్తున్నామని, అనంతగిరిలో 43 కోట్లతో 3 బిల్డింగ్స్ నిర్మిస్తున్నామని, డిఎంఎఫ్ టి 6 పనులును 12.97 కోట్లతో నిర్మిస్తున్నామని, కమ్యూనిటీ హల్స్ నిర్మిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఈ సీతారామయ్య,సీఈ రమేష్ బాబు,ఆర్టీసీ చీఫ్ ఇంజనీర్ కవిత,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపమ్మసుధీర్,రాధిక అరుణ్ కుమార్,చింతకుంట్ల లక్ష్మీ నారాయణరెడ్డి,సుబ్బారావు,దొంగరి వెంకటేశ్వర్లు,ఎరగాని నాగన్న,దొంతగాని శ్రీనివాస్,కోతి సంపత్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, మంజునాయక్,వీరారెడ్డి వెంకటరెడ్డి, మోతిలాల్,తదితరులు పాల్గొన్నారు.