calender_icon.png 6 August, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరకాశీలో పొంచి ఉన్న ప్రమాదం

06-08-2025 10:27:25 AM

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విద్యా సంస్థలకు ప్రభుత్వం బుధవారం సెలవు(Government declares holiday) ప్రకటించింది. ఉత్తరాఖండ్ లోని ధరాలీలో ఆకస్మిక వరదలు(Dharali floods) విరుచుకుపడ్డాయి. పౌరులను కాపాడేందుకు కేంద్రం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం(Government of Uttarakhand) చర్యలు చేపట్టింది. రెస్క్యూ కార్యక్రమాల్లో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమైయ్యాయిధరాలీలో సహాయక చర్యలను డెహ్రాడూన్ విభాగం పర్యవేక్షిస్తోంది. నిన్న ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలకు నలుగురు మృతి చెందారు.

ఆకస్మిక వరదలకు ఇళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్లు కొట్టుకుపోవడంతో 60 నుంచి 70 మంది చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల కింద మరో 12 మంది వరకు ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరకాశీ ఉత్పాతంలో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 130 మందిని సైన్యం, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ కాపాడింది.  కుంభవృష్టితో ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామంలో ఆకస్మిక వరదలు వచ్చాయి. ధరాలీ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహం కొండ పైనుంచి ఒక్కసారిగా ధరాలీ గ్రామపైకి దూసుకొచ్చింది. కొండ దిగువనున్న ధరాలీలోని ఇళ్లను వరదలు ముంచెత్తాయి. భగీరథి నది ప్రవాహాన్ని ఖీర్ గంగ ప్రాంతంలో వచ్చిన బురద, కొండచరియలు అడ్డుకున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో మరికొన్ని గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు.