calender_icon.png 6 August, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు కేటీఆర్ నివాళి

06-08-2025 10:02:52 AM

హైదరాబాద్: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్(Kothapalli Jayashankar) చిత్రపటానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) నివాళులర్పించారు. జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనను స్మరించుకున్నారు. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భావజాలవ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar Jayanti) అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ రథసారథి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కు అనునిత్యం అండగా ఉంటూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాక పోరాడిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కేటీఆర్ గుర్తుచేశారు.రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉందన్న కేటీఆర్ దీనికి తెలంగాణ వాదులంతా కంకణబద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు.