06-08-2025 01:52:47 AM
నిందితుడి వద్ద బుల్లెట్ కలకలం
బడంగ్‌పేట్, ఆగస్టు 5: ఓ చోరీ కేసులో అరెస్టు అయిన నిందితుడు వద్ద బుల్లెట్ దొరకడం కలకలం రేగింది. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు చంద్రశేఖర్ వద్ద బుల్లెట్ దొరికింది. సీఐ శంకర్‌కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో సోమన చంద్రశేఖర్ అలియాస్ (సన్నీ) అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
వృతి రీత్యా పెయింటర్. ఇటీవల ఒక మొబైల్ దొంగిలించాడు. అంగోత్ భరత్ నాయక్ తన ఫోన్‌ను చంద్రశేఖర్ దొంగిలించాడని పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అద్దెకుంటున్న నివాసంలో తనిఖీ చేశారు. ఇంటిలో మొబైల్ ఫోన్‌తో పాటు బ్యాగ్‌లో 8 ఎంఎం తుపాకి తూటా లభించింది. దీంతో పోలీసులు విచారించగా గచ్చిబౌలిలో పెయింట్ పనికి వెళుతుంటే రోడ్డుపై దొరికిందని చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.