18 April, 2026 | 11:02 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

స్వామి దయతోనే మంత్రి పదవి

11-06-2025 12:51 AM
  1. ధర్మపురి నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి 

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి 

జగిత్యాల, జూన్ 10 (విజయక్రాంతి): ధ ర్మపురి లక్ష్మీ నర్సింహస్వామి దయతోనే తన కు మంత్రి పదవి లభించిందని రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొ న్నారు. సోమవారం హైదరాబాద్ రాజ్ భవ న్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి మంగళవారం సా యంత్రం ధర్మపురి లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రి హోదాలో తొలిసారి ఆలయా నికి వచ్చిన అడ్లూరికి అధికారిక లాంఛనాలతో ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ వేదంపండితులు, అర్చకులు అడ్లూరిని ఆశీర్వదించారు.

ధర్మకర్తల మండలి చైర్మన్ జ క్కు రవీందర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు, చిత్రపటం బహుకరించి మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అడ్లూరి మా ట్లాడుతూ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్లే తనకు మంత్రి పదవి లభించిందన్నారు. పేదల సంక్షేమానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు.

తనపై ఎంతో విశ్వాసంతో తనను గెలిపించిన ప్రజ ల నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి గా స్థానం కల్పించిందని, శక్తి వంచన లేకుం డా తన బాధ్యతను నిర్వర్తిస్తానని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. కాగా మంత్రి హోదాలో తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన అడ్లూరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. 

మొదట అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులర్పించి, పెద్ద ఎత్తున సాగిన ర్యాలీలో మంత్రి అడ్లూరి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, పలువురు జిల్లాస్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ స్థాయి నాయకులతో పాటూ పలువురు ప్రముఖులు మంత్రి అ డ్లూరిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలుతెలిపారు.