ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
19-08-2026 07:47 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాయా చిత్ర సృష్టికర్త లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం లక్ష్య గ్రాండ్ లో ఫోటోగ్రాఫర్లను శాలువాలతో సన్మానించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, అధ్యక్షులు ఎండి సమీర్, గ్రామ నాయకులు వంకాయల రవి సదాశివానగర్ మండల అధ్యక్షులు డి రాజు గౌరవ అధ్యక్షులు ఆశన్న, ప్రధాన కార్యదర్శి క్రాంతి, కోశాధికారి ఉమా శేఖర్, ఉపాధ్యక్షులు రాజ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్, కోశాధికారి బద్దం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్,కుటుంబ భరోసా ఇంచెర్జ్ శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నరు.






