చేగుంటలో 22వ తేదీ నుండి జిల్లాస్థాయి యోగాసన పోటీలు
కోచ్ కరణం గణేష్ రవి కుమార్
చేగుంట,(విజయక్రాంతి): చేగుంటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి యోగాసనా పోటీలు ఆగస్ట్ 22 ఉంటాయని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కరణం గణేష్ రవికుమార్,ప్రధాన కార్యదర్శి మేడభుజగేందర్ రెడ్డి, ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు సబ్ జూనియర్, 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు జూనియర్, 18 నుండి 28 సంవత్సరాల వరకు సీనియర్ బాలబాలికలకు 28 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు, 35 నుండి 45సంవత్సరాల వరకు, 45 నుండి 55 సంవత్సరాల వరకు మహిళలకు పురుషులకు పోటీలు ఉంటాయని వారు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొని క్రీడాకారులు క్రీడాకారిణిలు ఉదయం 8 గంటల వరకు చేగుంటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాజరు కావాలనీ వారు తమ వెంట బోనఫైడ్, ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ తోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావలని అన్నారు.






