19 August, 2026 | 8:19 PM

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం

19-08-2026 07:34 PM

- బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి

బేల,(విజయక్రాంతి): గత ఏడాది భారీ వర్షాలకు పెన్ గంగా నది పరీవాహక ప్రాంతాలలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో ఆమె మాట్లాడుతూ... గత డిసెంబర్ నెలలో జీవో జారీ చేసి నిధులు మంజూరు చేసి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ రైతులకు నష్ట పరిహారం అందలేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రైతులకు పరిహారం అందేలా కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రైతులు సుఖ్ దేవ్, గోపాల్ కడ్సే, వెంకట్ రెడ్డి, ప్రకాశ్, ఆశిష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.