18 April, 2026 | 5:04 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం

24-09-2025 08:31 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. 63,837 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 20,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.85 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇవాళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం మాడ వీధుల్లో గరుడ పఠం, పరివార దేవతలు ఊరేగనున్నారు. సాయంత్రం 5:45కి ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.