23 June, 2026 | 5:35 PM

‘ఇందిరమ్మ’ చెల్లింపుల్లో స్వల్పమార్పులు

27-10-2025 02:22 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు నాలుగు విడతలుగా అందజేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో  ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ర్ట రెవెన్యూ, గృహ నిర్మాణ  శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  తెలిపారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐహెచ్‌హెచ్‌ఎల్ ) పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని ఆదివారం ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు.

కేవలం చెల్లింపుల షెడ్యూల్‌లో  మాత్రమే మార్పులు జరు గుతున్నాయని,  లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.5 లక్షల మొత్తంలో ఎలాంటి మా ర్పు ఉండదని   స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తయితే రూ. లక్ష, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో లక్ష విడుదల చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రస్తుతం రూఫ్ పూర్తయిన తరువాత లబ్ధిదారులకు రూ.2 లక్షలను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి (90 రోజుల పనిదినాల మొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్దేశించిన మొత్తం) వారి ఖాతాల్లోకే నేరుగా జమవుతుందని, ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి స్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మొత్తాన్ని రూ.1.40 లక్షలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించనట్లు మంత్రి వివరించారు.

ఇకపై స్లాబ్ పూర్తయిన తరువాత రూ.1.40 లక్షలను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని,  మిగిలి న మొత్తాన్ని (రూ.60 వేలను)కూడా లబ్ధిదారుల ఖాతాల్లో ఉపాధి హామీ పథకం కింద అందజేస్తారని తెలిపారు.