calender_icon.png 27 October, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్రస్థాన్లు సరే.. ఆలయాలు వద్దా?

27-10-2025 02:20:55 AM

కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు కౌంటర్

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): ముస్లిం కబ్రస్థాన్లకు ఒకే...కానీ హిందూ ఆలయాలు వద్దా?, బీఆర్‌ఎస్ పార్టీ ముస్లింల కోసం కబ్రస్థాన్లు డిమాండు చేయొచ్చు కానీ, బీజేపీ హిందూ దేవాలయా ల గురించి మాట్లాడితే తప్పా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా కేటీ ఆర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘బంజారాహిల్స్ పెద్దమ్మగుడి పునర్నిర్మాణం చెయ్య డం తప్పా? నేను ఆలయాల గురించి మాట్లాడినప్పుడు అభివృద్ధి గురించీ మాట్లా డా. కానీ కొందరి మూర్ఖులకు అందులో వారికి నచ్చిన మాటలే వినిపిస్తాయి. హైదరాబాద్‌లో ఒక్క వాన పడితే చాలు.. గత మున్సిపల్‌శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పదేళ్ల వైఫల్యం బయటపడిపోతుంది. ‘నువ్వు జూబ్లీహిల్స్ అంటే కేవలం బంగళాలు అనుకున్నావు. ఇప్పుడు బస్తీల ప్రజలు మాట్లా డుతున్నారు.

కేసీఆర్ కుమారుడు నటన మొదలుపెట్టాడు. మేము దేవాలయాలు నగరం మధ్యలో ఉండాలని, కబ్రస్థాన్లు బయట ఉండాలని నమ్ముతాం. కానీ నువ్వు మాత్రం ఈ నగరాన్నే కబ్రస్థానంలా మార్చా లనుకుంటున్నావు. నీవి తుష్టీకరణ రాజకీయాలు కాకపోతే, హిందువులపై దాడులకు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావ్. సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మగుడిపై దాడి జరిగి నప్పుడు, బంజారాహిల్స్ పెద్దమ్మగుడిని మార్చినప్పుడు, వేములవాడలో గోవులు ఆలయ షెడ్లలో చనిపోయినప్పుడు,

భద్రాచలం ఆలయ భూములు ఆక్రమించి ఈఓపై దాడి చేసినప్పుడు, గౌ రక్షక్ సోనూ సింగ్‌పై దాడి జరిగినప్పుడు, హనుమాన్ విగ్రహం అపవిత్రం చేసినప్పుడు?, కేసీఆర్ మా విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఒక ఆటగా తీసుకున్నారు. దాని ఫలితం చూశారు. అమ్మవారు శక్తివంతురాలు. ఆమె నాస్తికులకు తగిన శాస్తి చేస్తుంది’ అని ట్వీట్ చేశారు.