26 March, 2026 | 2:52 AM

సోమశిలలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ అపశృతి

26-03-2026 12:34 AM

- విరిగిన ధ్వజ స్థంభం..మరో ధ్వజ స్తంభం ఏర్పాటు.

కొల్లాపూర్ మార్చి 25: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా బుధవారం ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించే క్రమంలో స్తంభం విరిగిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది.

ఆలయ కమిటీ నిర్వాహకులు, ప్రధాన పూజారులు అలాంటి స్తంభాన్ని మరొకటి ఏర్పాటు చేస్తూ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మూడు రోజులుగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అశేషంగా భక్తులు హాజరై మొక్కలు తీర్చుకున్నారు. లలిత సోమేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పివి వెంకటరమణ రెడ్డి శ్యామల రెడ్డి. జ్ఞాపకార్థం 3లక్షలతో మంతటి గడ్డ నుంచి మరో ధ్వజస్తంభం తెప్పిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి నిలబెట్టారు.