సిబ్బంది కొరతతో వైద్య సిబ్బంది మనోవేదన
- డిమాండ్లు తీర్చకపోతే ధర్నాలు, సమ్మె చేస్తాం
పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాల్వ చక్రధర్
గజ్వేల్, మార్చి 25: జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో తీవ్ర సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు తీవ్రమైన పనిభారం, అధికారుల ఒత్తిడితో మానసికంగా, శారీరకంగా ఇ బ్బందులు పడుతున్నారని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐఎన్ టియుసి -3194) జిల్లా అధ్యక్షులు కా ల్వ చక్రధర్ ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ ఐఓసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసి న యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామాల్లో ప్రజాసేవ అందిస్తున్న వైద్య సిబ్బంది రాత్రింబవళ్లు విధుల్లో నిమగ్నమై, ఆన్లైన్, ఆఫ్లైన్ పనులతో రోజులో 60 శాతం సమయం ఖర్చు చేస్తున్నారన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బం ది కొరత అధికంగా ఉండటంతో పనిభారం పెరిగి, అధికారులు విధిస్తున్న లక్ష్యాలు, ఒత్తిడితో సిబ్బంది కృంగి పోతున్నారన్నారు. ఆశా కార్యకర్తలు సమ్మెలో ఉన్న సమయం లో కుష్టు వ్యాధి సర్వే కోసం ఇంటింటికీ వెళ్లాలని ఆదేశించడం అన్యాయమన్నారు.
కుకునూరుపల్లి, దౌల్తాబాద్, అక్కన్నపేట్, కొండపాక ప్రాంతాల పీహెచ్సీల సమస్యల ను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వర లో జిల్లా వైద్యాధికారి, కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. న్యాయమైన డిమాం డ్లు పరిష్కరించని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి, అవసరమైతే సమ్మెకు దిగుతామన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, సిబ్బంది రేషనలైజేషన్ చేసి పనిభారం తగ్గించాలని, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని,డీఏ బకాయిలు చెల్లించాలన్నారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని శాశ్వతీకరించాలని, 10 నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలన్నారు. మెడికల్ బిల్లులు, రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని, కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో 36 రకాల ఆన్లైన్ యాప్స్, రికార్డులు నిర్వహించాలంటూ వేధిస్తున్నారన్నారు. వారి ప్రవర్తన మార్చుకోకపోతే ఏప్రిల్లో ధర్నాలు నిర్వహించి, సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు.
ఈ సమావేశంలో గజ్వేల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, రాష్ట్ర నాయకులు పాండవుల కుమారస్వామి, కాసుల రవీందర్ రెడ్డి, బి. శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ కార్యదర్శి భూంపల్లి రాజు, గౌరవాధ్యక్షులు చెరుకు భాస్కర్, ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాలువ శోభ, గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు ఆదిమూలం నారాయణ తదితరులు పాల్గొన్నారు.




