15 June, 2026 | 11:07 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అదే ప్రేమను నాకూ పంచండి

19-09-2024 12:52 AM

‘దేవర’ చిత్రం కోసం ప్రస్తుతం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాతో జాన్వీకపూర్ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతుంది. ఈ నెల 27న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను మేకర్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా చిత్రబృందం కోలీవుడ్‌లో ప్రమోషన్స్ వెళ్లగా, హీరోహీరోయిన్లు తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇద్దరూ అక్కడి భాషలో అదరగొట్టారు. తెలుగు వాడైన తారక్‌కు ఇతర భాషల్లోనూ పట్టు ఉందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆయన తాజా కార్యక్రమంలో తమిళ్‌లో అనర్గళంగా మాట్లాడాడు. ఇక జాన్వీ విషయానికొస్తే.. తమిళ్‌లో ఎంతో అందంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచిందీ భామ.

“నా తల్లి శ్రీదేవిపై తమిళ ప్రజలు ఇప్పటికీ కురిపిస్తున్న అచంచలమైన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. చెన్నై నాకు చాలా ప్రత్యేకమైనది. మా అమ్మ (శ్రీదేవి)తో నాకు చెన్నైకి సంబంధించిన మంచి జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. నేను, నా కుటుంబం ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి కారణం.. మీరు మా అమ్మపై కురిపించిన ప్రేమే. ఇందుకు నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. అదే ప్రేమను మీరు నాకూ పంచుతారని ఆశిస్తున్నాను. మీ ప్రేమను పొందడానికి నేను చాలా చాలా కష్టపడి పనిచేస్తానని మాట ఇస్తున్నాను” అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది జాన్వీ.

సినిమా గురించి చెప్తూ.. “దేవర’ నాకు చాలా ప్రత్యేకమైనది. దీనికోసం మేము పడ్డ కష్టం వృథా కాదని, ఈ సినిమాతో మీరు ఆనందిస్తారని నమ్ముతున్నా. నిజంగా ఇది నా గుండె లోతుల్లో నుంచి వస్తున్న మాట” అని చెప్పుకొచ్చింది. జాన్వీ తమిళంలో మాట్లాడటం ఇదే తొలిసారి కావటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళ తంబీలంతా ‘జాన్వీ తమిళ్‌లో ఎంతో చక్కగా మాట్లాడిందో కదూ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తద్వారా కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ ముద్దుగుమ్మ మంచి అటెన్షన్‌ను తెచ్చుకుందని తెలుస్తోంది.