10 March, 2026 | 5:38 AM

గల్ఫ్‌పై క్షిపణుల వర్షం

10-03-2026 02:22 AM

ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్

సౌదీలోని అల్-ఖర్జ్ నగరంపై క్షిపణి

ఒక భారతీయుడు మృతి.. 

బహ్రెయిన్‌లోని ఆయిల్ రిఫైనరీ కేంద్రంపైనా దాడి

దుబాయ్/అబుదాబీ, మార్చి 9: తమ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ఇరాన్ సైతం గట్టిగానే బదులిస్తున్నది. దీనిలో భాగంగానే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నది. బహ్రెయిన్‌లోని అమెరికన్ నేవీ బేస్ పై క్షిపణుల వర్షం కురిపించింది. దాడిలో 21 మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఇది అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ. బహ్రెయిన్‌లోని వాటర్ డీసాలినేషన్ ప్లాం ట్‌పై, ఒక ఆయిల్ రిఫైనరీ కేంద్రంపైనా ఇరా న్ డ్రోన్లతో దాడి చేసి ధ్వంసం చేసింది. దాడి ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. 

సౌదీ అరేబియాలో భారతీయుడు మృతి

సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ నగరంలోని ఓ నివాస సముదాయంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో బంగ్లాదేశ్‌కు చెందిన మరో వ్యక్తి కూడా మృతిచెందాడు.  12 తీవ్రంగా గాయపడ్డారు. 

కువైట్ సెక్యూరిటీ టవర్‌పై దాడి

కువైట్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాడుల్లో పలువురు కువైట్ పౌరులు క్షతగాత్రులయ్యారు. పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నట్లు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఇరాన్ దాడిలో సోషల్ సెక్యూరిటీ టవర్‌కు మంటలు అంటుకున్నాయని, తమ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడారని తెలిపింది. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకులపైనా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. పేలుళ్లలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. 

యూఏఈపై 16 క్షిపణుల ప్రయోగం

దుబాయ్ నగరంపై ఇరాన్ ఒక్కరోజులోనే 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లతో విరుచుకుపడింది. వీటిలో 15 మిసైళ్లు, 119 డ్రోన్లను దుబాయ్ ఆర్మీ గాలిలోనే కూల్చివేసింది. అక్కడి అంతర్జాతీయ విమానాశ్ర యాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ దాడు లు చేసింది. గల్ఫ్ ప్రాంత భద్రతను ఇరాన్ ప్రమాదంలో పడేసిందని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు దేశాలపై దాడులు చేయబోమన్న మాటను ఇరాన్ తప్పిందని ఆరోపించింది.