calender_icon.png 29 May, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం

26-05-2025 12:00:00 AM

  1. 367 డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడి.. 12 మంది మృతి
  2. 30కి పైగా నగరాలు, గ్రామాలే లక్ష్యంగా దాడులు
  3. ఉద్దేశపూర్వక దాడులంటూ జెలెన్ స్కీ ఆగ్రహం

కీవ్, మే 25: ఉక్రెయిన్‌పై రష్యా మరోసా రి క్షిపణుల వర్షం కురిపించింది.మూడేళ్ల కి ందట మొదలైన రష్యా, ఉక్రెయిన్ యు ద్ధంలో ఉక్రెయిన్ భూభాగంపై  రష్యా ఇంత పెద్ద సంఖ్యలో వైమానిక ఆయుధాలతో జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 367 డ్రోన్లు, క్షిపణులతో రష్యా చేసిన భీకర దా డుల్లో 12 మంది మృతి చెందగా.. డజన్ల స ంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఒకవైపు ర ష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ ఖైదీల మా ర్పిడి జరుగుతున్నప్పటికీ ఇరుదేశాల మధ్య దాడులు మాత్రం ఆగడం లేదు.

యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా శుక్రవారం ఇరుపక్షాలు 390 మంది చొప్పున మార్పిడి చేసుకోగా శనివారం 307 మందిని ఇరుదేశాల మార్పిడి చేసుకున్నాయి. తాజాగా మరో 303 సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్టు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఈ ప్రకటన రాకముందు కీవ్‌తో పాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు చేసింది. ఒకేరోజు 69 క్షిపణులతో పాటు 298 డ్రోన్లతో విరుచుకుపడింది.

వీటిలో ఇరాన్ రూపొందించిన షాహెద్ డ్రోన్లు కూడా ఉన్నట్టు సమాచారం. రష్యా చర్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లోని సాధారణ నగరాలపై రష్యా ఉద్దేశపూర్వక దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ క్రూరత్వాన్ని అడ్డుకోలేమని వెల్లడించారు. ఈ సందర్భంగా రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను అభ్యర్థించారు.