calender_icon.png 7 July, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్లలో ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్

07-07-2025 10:59:51 AM

ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

జడ్చర్ల: జడ్చర్ల(Jadcherla) కు చెందిన ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ అయిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బురెడ్డిపల్లి పరిధిలోని బృందావన కాలనీకి చెందిన దీవెన అనే యువతి శంషాబాద్(Shamshabad)లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. విధులు నిర్వహించేందుకుగాను ఆదివారం సాయంత్రం జడ్చర్ల బస్టాండ్(Jadcherla Bus Stand)లో షాద్ నగర్ పోయేందుకు గాను బస్సును కుటుంబ సభ్యులు ఎక్కించారు. తీరా చేరుకోవాల్సిన సమయానికి ఆ ప్రాంతానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అలాగే జడ్చర్ల లోని గౌరీ శంకర్ కాలనీకి(Gouri Shankar Colony) చెందిన వనజ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి 8:30 గంటలకు ఇంటికి చేరుకుని చూడగా ఇంట్లో తమ బిడ్డ వనజ కనిపించలేదని, చుట్టుపక్కల వారితో పాటు బంధుమిత్రులను కుటుంబ సభ్యులు సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఆచూకీ కనిపించకూడదు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. జడ్చర్ల పట్టణంలో ఇద్దరు అమ్మాయిలు వేరు వేరు  ప్రాంతాల నుంచి మిస్సింగ్ కావడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.