calender_icon.png 7 July, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'వన మహోత్సవం' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

07-07-2025 11:04:52 AM

మణికొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజేంద్రనగర్(Rajendranagar) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్(Photo exhibition)ను సందర్శించిన సీఎం యూనివర్సిటీ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటి వనమహోత్సవం-2025( Vana Mahotsavam)ను ప్రారంభించినట్లు ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18 కోట్లకుపైగా మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా వెల్లడించారు.