23 June, 2026 | 8:39 PM

Breaking News

చర్ల రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా   •   ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం   •   కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి   •   బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

రేవల్లికి సరఫరా లేని మిషన్ భగీరథ నీరు

07-08-2025 12:25 AM
  1. లీకీజీలతో వృధాగా పారుతున్న నీరు 

విషయం జిల్లా అధికారులకు తెలిపిన పట్టింపులేదు 

రేవల్లి : ఆగస్టు 6: ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ, మహిళలకు నీటి కష్టాలను దూరం చేసేందుకు గత 5ఏండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం  వేల కోట్ల రూపాయలను వెచ్చించి మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలకు శుద్ది చేసిన జలాలను అందిస్తుండగా మిషన్ భగీరథ అధికారుల మరియు పంచాయతీ అధికారుల అలసత్వం వల్ల మండల కేంద్రం రేవల్లి కి నీటికి మంచినీరు అందక గ్రామ ప్రజలు కలుషిత జలాలను తాగుతూ అవస్థలను ఎదుర్కొంటున్నారు,

ఈ విషయమై సంభందిత మిషన్ భగీరథ అధికారులకు తెలపగా వారు గ్రామానికి చేరుకొని పంచాయతీ అధికారులతో కలిసి గ్రామంలో హడావిడి సృష్టించి తాత్కాలికంగ మిషన్ భగీరథ నీటిని పునరుద్దరించి ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారు.

అనా ది నుండి, రెండురోజుల తధనంతరం పరిస్థితి మొదటికి వస్తుంది, గ్రామం వెలుపల ఉన్న పైపులు లేకేజీలు ఏర్పడి విలువైన మం చినీరు వృధా అవుతున్న గ్రామ పంచాయతీ అధికారులు లేదా మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి, ఇప్పటికైన సంభందిత అధికారులు కల్పించుకొని రేవల్లి గ్రామానికి శుద్ధి చేసిన మిషన్ భగీరథ మంచినీటిని అందిం చి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.