calender_icon.png 6 August, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీని గద్దె దించి.. అనుకున్నది సాధిస్తాం

06-08-2025 03:02:12 PM

న్యూఢిల్లీ: జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా కొనసాగుతోంది. ఈ ధర్నాలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆశయం మేరకు మేం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు(BC Reservations) తెచ్చామన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించామని సీఎం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని జోడో యాత్రలో రాహుల్ గాంధీ డిమాండ్  చేశారని గుర్తుచేశారు. అసెంబ్ల పంపిన బిల్లులు రాష్ట్రపతి(President) వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. బిల్లులు పంపించి 4 నెలలు గడిచినా.. రాష్ట్రపతి ఆమోదించలేదని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించాలని రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావించి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ తమకు దొరకలేదన్నారు. మాకు అపాయింట్ మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై ప్రధాని మోదీ ఒత్తిడి చేశారని అనుమానం ఉందన్నారు. బిల్లులు ఆమోదించేవరకు తమ పోరాటం కొనసాగుతోందని సీఎం పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపు అంశంపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరగాలన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణన జరిగిందని తెలిపారు. మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసైనా మేం అనుకున్నది సాధిస్తామని తేల్చిచెప్పారు. ముస్లింలను బూచీగా చూసి బీసీ బిల్లును అడ్డుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.