15 June, 2026 | 2:05 PM

Breaking News

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •  

లీకేజీ వల్ల వృథాగా మిషన్ భగీరథ నీరు

10-06-2026 01:01 AM

వ్యవసాయ పొలంలో పైపు లైన్ లీక్

సంవత్సరం నుండి పట్టించుకోని అధికారులు

రాజాపూర్ జూన్ 9: ప్రజలకు సురక్షితమైన అందించాలని సంకల్పంతో కృష్ణా నది నీళ్లు ఇంటింటికి మిషన్ భగీరథ పథకము ద్వారా అందించాలని ప్రభుత్వం ఎంతో శ్రమించి ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందిస్తుంది.

మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్ల మండలంలోని చొక్కామ్ పెట్ గ్రామ ప్రారంభంలోని వ్యవసాయ క్షేత్రంలో గత సంవత్సరం నుండి మిషన్ భగీరథ పైపు లీకేజీ అయి ఇండ్ల ముందర నుండి నీరు వృధాగా పోతున్న ఎవరు పట్టించుకోవడంలేదు. ఆ వ్యవసాయ పొలంలో ఖరీఫ్ యాసంగి సీజన్ లో వరి పంట వేయడం వల్ల మిషన్ భగీరథ లీకేజీ ని అధికారులు గుర్తించకపోవడంతో వ్యవసాయ బోరుబావి నీళ్లే వృధాగా పోతున్నాయని అనుకొని ఎవరూ అటువైపు చూడలేదు.

పైపు లైన్ లీకేజీ నుండి నిరంతరం ధారగా నీరు ఊబికి వస్తున్నటువంటి క్రమంలో ఈయాసంగిలో రైతు వరి పంట కోసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వందలాది కిలోమీటర్ల నుండి తీసుకువచ్చిన నీరు సరైన నిర్వహణ లేక వృధాగా పోవడంపై ప్రజలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మిషన్ భగీరథ పైపు లైన్ లికేజీ వల్ల కొన్ని గ్రామాలకు మంచినీరు సక్రమంగా రావడంలేదని ఆవేదన చెందుతున్నారు.  మిషన్ భగీరథ అధికారులు స్పందించి మిషన్ భగీరథ లీకేజీలను సరి చేయడం స్వచ్ఛమైన నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.