27 July, 2026 | 8:47 PM

Breaking News

తప్పుల మీద తప్పులు!

26-06-2024 12:09 AM

నిమ్జ్ ప్రాజెక్టులో అక్రమాలు

భూ రికార్డుల్లో తప్పుల సాకు

ఎకరాకు లక్ష వరకు వసూలు

డిప్యూటీ కలెక్టర్ల కనుసన్నల్లోనే అవినీతి

అడ్డాగా న్యాల్‌కల్ తహసీల్దార్ ఆఫీసు 

ఫిర్యాదు చేసిన చర్యలు కరువు

ఆర్‌ఐ యవ్వారంతో వెలుగులోకి వాస్తవాలు

సంగారెడ్డి, జూన్ 2౫ (విజయక్రాంతి) : జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్) ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ పరిహారం చెల్లింపులో అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. రైతుల నుంచి భూసేకరణ కో సం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశారు. జహీరాబాద్‌లో నిమ్జ్ ప్రాజెక్టు కార్యాలయం ఏర్పాటు చేసిన ఇద్దరు  డిప్యూటి కలెక్టరులను నియమించారు. వీరితో పాటు రెవెన్యూ  శాఖలో పని చేసిన పదవి విరమణ చేసిన అధికారులను డిప్యూటి తహసీల్దార్ ర్యాక్ వారిని తీసుకున్నారు.

క్షేత్రస్థాయిలో భూములు పరిశీలించేందుకు రెవెన్యూ శాఖలో పని చేస్తున్న ఆర్‌ఐలను నియమించి భూసేకరణ చూస్తున్నారు. ఝరాసంగం, న్యాల్‌కల్ మండలంలోని 17 గ్రామల్లో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూమిని సేకరిస్తున్నారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం 12680.24 ఎకరాల భూసేకరణ  చేస్తున్నారు. నిమ్జ్‌లో భూములు కోలిపోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 15 లక్షలు పరిహారం చెల్తిస్తుంది. మొదటి విడుత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ. 3 లక్షలు, రూ. 4.5 లక్షలు. రూ. 5 లక్షల వరకు చెల్లించారు. కొందరు రైతులు కోర్టుకు కోవడంతో ప్రభుత్వ ఎకరానికి రూ.15 లక్షల పరిహారం చేశారు. రైతులకు నష్టాపరిహరం చెల్లించడంలో రెవెన్యూ, నిమ్జ్ ప్రాజెక్టు అధికారులు మామూలు తీసుకోని వరకు నష్టపరిహారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

 నిమ్జ్ నష్టపరిహారంలో చెల్లింపులో భారీగా డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు..?

  జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న నష్టపరిహారంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. న్యాల్‌కల్ మండలంలో భూములు కోలిపోతున్న రైతులకు నష్టపరిహారంలో చెల్లించడంలో రెవెన్యూ, నిమ్జ్ ప్రాజెక్టు కార్యాలయంలో పని చేసే  అధికారులు పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రతి గ్రామంలో అధికారులు ఎజెంట్లును నియమించుకోని రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. రైతుల భూముల పైన కేసులు లేకపోయిన పాత రికార్డులు తీసి రికార్డులో తప్పులు ఉన్నాయని, వారిని సరిచేస్తేనే డబ్బులు వస్తాయని రైతులకు తెలిపి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. 

 నిమ్జ్ ప్రాజెక్టులో చక్రం తిప్పుతున్న విశ్రాంతి డిప్యూటి తహసీల్దార్, 

ఆర్‌ఐ స్థాయి అధికారులు 

 జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఇద్దరు అధికారులు భారీగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని జిల్లా అధికారులకు తెలిపిన వారు చర్యలు తీసుకోలేదు. న్యాల్‌కల్ మండలంలో రెవెన్యూ శాఖలో నయాబ్ తహసీల్దార్‌గా పని చేసి పదవి విరమణ చేసిన అధికారిని నిమ్జ్ ప్రాజ్టెలోకి తీసుకోని కీలక బాధ్యతలు అప్పగించారు. న్యాల్‌కల్‌లో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న అధికారిని నిమ్జ్ ప్రాజెక్టులోకి తీసుకోని రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నారు. నిమ్జ్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఇద్దరు అధికారులు కలసి రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో భారీగా అక్రమలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోలేదు.  విశ్రాంతి డిప్యూటి తహసీల్దార్, ఆర్‌ఐ కలసి రైతుల  పాత రికార్డులు పరిశీలించి మీ భూమి పై ఫిర్యాదులు, కోర్టు కేసులు ఉన్నాయని , వాటిని తొలగించేందుకు డబ్బులు ఖర్చు కావడం జరుగుతుందని తెలిపి అందినకాడికి డబ్బులు వసూలు చేస్తున్నారు. నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ప్రభుత్వ న్యాల్‌కల్ మండలంలో ఎక్కువగా భూసేకరణ చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన రెవెన్యూ అధికారులు రైతుల నుంచి ఎకరానికి రూ . లక్ష వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

నిమ్జ్ ప్రాజెక్టులో భారీగా అక్రమాలు...?

 జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టులో పని చేస్తున్న అధికారులు రైతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రైతుల భూములు నిమ్జ్ ప్రాజెక్టులో పోవడంతో నష్టపరిహారం కోసం అధికారులు పలు దొంగ దారులు చూపిస్తున్నారు. రైతుల నుంచి మామూలు తీసుకోని  (ఉదాహరణకు రైతు భూమిలో వ్యవసాయ బావులు, బోరులు, చెట్లు, పైపులైన్)తో పాటు ఇతర వాటిని లెక్కించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. కాని నిమ్జ్ ప్రాజెక్టులో పని చేసే విశ్రాంతి అధికారి, న్యాల్‌కల్ మండలంలో పని చేసే అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

రైతుకు కొంత డబ్బు ఇచ్చి మిగత డబ్బులు అధికారులు తీసుకుంటున్నారని తెలిసింది. ప్రతి రైతు నుంచి నష్టపరిహారం కోసం నివేదిక ఇచ్చేందుకు అధికారులు ఎకరానికి రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. ప్రతి గ్రామం లో అధికారులు నియమించుకున్న ఏజెంట్లు చెప్పిన వారికి చెక్కులు ఇస్తున్నారని తెలిసింది. నిమ్జ్ ప్రాజెక్టులో పని చేసే ఇద్దరు డిప్యూటి కలెక్టర్ కనుసైగలో అవినీతి అక్రమలు జరుగుతున్నాయనే ఆరోపణ లు ఉన్నాయి. కార్యాలయంలో పని చేసే విశ్రాంతి అధికారి, ఆర్‌ఐ స్థాయి అధికారి అనేక అక్రమలకు పాల్పడిన జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. న్యాల్‌కల్ తహసీల్దార్ కార్యాలయం అవినీతి అక్రమలకు కేంద్రంగా మరిపోయింది. 

 ప్రభుత్వం నిమ్జ్  భూ బాధితులను ఆదుకోవాలి

 నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు డబ్బులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న అధికారులు వారికి చెక్కులు ఇవ్వడం లేదు. నష్టాపరిహారం చెక్కులు ఇవ్వడం కోసం రెవెన్యూ, నిమ్జ్ ప్రాజెక్టులో డబ్బులు ఇస్తామని ఒప్పుకుంటనే చెక్కులు సిద్దం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తగు చర్యలు తీసుకోని భూములు ఇస్తున్న రైతులకు నేరుగా చెక్కులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి ధర రూ. కోటి ఉన్న రైతులు నిమ్జ్ ప్రాజెక్టుకు ఎకరానికి రూ.15లక్షలకు ఇస్తున్నారు. తక్కువ ధరకు భూములు ఇస్తున్న రైతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడం పై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్జ్ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమల పై విచారణ చేసి రైతులను అందుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.