calender_icon.png 5 June, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మిట్టపల్లి కిరణ్ కుమార్-రాజ్యలక్ష్మి దంపతుల పెళ్లిరోజు వేడుక

03-06-2025 11:15:29 PM

సంబరంగా జరిపిన వైరా ఆర్యవైశ్య మహాసభ మండల పట్టణ కమిటీ.. 

హాజరైన ఆర్యవైశ్య ప్రముఖులు..

వైరా (విజయక్రాంతి): ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య వైరా మండల అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్-రాజ్యలక్ష్మి దంపతుల పెళ్లిరోజు మంగళవారం వైరాలో ఘనంగా నిర్వహించారు.. ఆర్యవైశ్య మహాసభ మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో  ఆర్యవైశ్య ప్రముఖులు ఈ వేడుక హాజరై  దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.  కిరణ్ కుమార్ రాజ్యలక్ష్మి దంపతులు ఆ కుటుంబం  నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని, కిరణ్ కుమార్ మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆర్యవైశ్య పెద్దలు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు నూకల శ్రీనివాసరావు (వాసు) నూకల ప్రసాద్ గజ్జల కృష్ణమూర్తి కొల్లా రాంబాబు తోపాటు వైరా ఆర్యవైశ్య మండల పట్టణ కమిటీ సభ్యులు  వాసవి యూత్ సభ్యులు కొణతలపల్లి నగేష్,  గజ్జల నరసింహారావు,కొప్పురావూరి శబరినాథ్,సముద్రాల మురళి కృష్ణ,ధార వెంకట కృష్ణ,మిట్టపల్లి విజయ్ కుమార్,కొణతలపల్లి సుజిత్ మాలే  ఉదయ్ తేజ అనుమోలు రాకేష్ ఖాజా కృష్ణ మూర్తి తెల్లకుల సందీప్ చల్లా వెంకట రమణ బోనాల సాయి నిఖిల్ జల్లా అవినాష్ తదితరులు పాల్గొన్నారు..