3 April, 2026 | 3:15 AM

తాసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

03-04-2026 12:30 AM

రేవెల్లి ఏప్రిల్ 2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేవల్లి మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మండలాల్లో నూతన కార్యాలయ భవనాల ఏర్పాటుకు కృషి చేస్తోందని వారు తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చేందుకు సహకరించిన వారిని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.