3 April, 2026 | 2:15 AM

రాష్ట్రంలో రైతుల అభివృద్ధ్దే రాష్ట్ర అభివృద్ధి

03-04-2026 12:28 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మెట్ పల్లి, ఏప్రిల్ 2(విజయక్రాంతి):ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఎఎంసి సెంటర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రైతులు తమ పంటను సంబంధిత కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర వద్ద అ మ్ముకోవాలని కోరారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటలకు ప్రభుత్వం తగిన మ ద్దతు ధర రెండు వెల నాలుగు వందల రూ పాయలు కల్పిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని, మధ్యవర్తులు లేకుండా నేరుగా తమ పంటను విక్రయించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం మా ప్రాధాన్యత అని అన్నారు.ఈ సందర్భంగా కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ప్రతి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, రైతులకు లాభదాయకమైన విధానాలను అమలు చేస్తూ, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకున్నామని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

తూకం, నిల్వ, చెల్లింపుల ప్రక్రియలను వేగవంతంగా నిర్వహించి, రైతులకు సకాలంలో నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ పంటను శుభ్రంగా, తేమ శాతం ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీవో నరసింహారావు, మార్క్ఫెడ్ అధికారులు, తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు,రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.