calender_icon.png 10 May, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగులకు స్కూటీలు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

08-04-2025 04:55:35 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ GiftASmile లో భాగమయ్యారు. కవిత జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమంలో భాగమవ్వాలని ఆలోచనతో తనవంతుగా వికలాంగులకు రెండు స్కూటీలను ఎమ్మెల్యే మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను అందరూ GiftASmile లో జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.