calender_icon.png 10 January, 2026 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల కూర తినడానికి ప్రాజెక్టుల పేరెందుకు?

09-01-2026 12:00:00 AM

ఏదో రాజకీయ రగడ సృష్టించాలన్నదే వారి లక్ష్యం

గత పదేండ్లలో చేసింది ఏందో చెప్పాలి 

విలేకరులతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

జడ్చర్ల, జనవరి 8: ఏదో రాజకీయ రగడ సృష్టించాలి ప్రజలకు నాలుగు మాయమాటలు చెప్పాలి తప్పుదోవ పట్టించాలి అనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలని తపన బి ఆర్ ఎస్ నేతలకు లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారం జడ్చర్లలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు దగ్గర బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రాజెక్టును పరిశీలించగా అక్కడికి వెళ్లి చేపల కూర తినడానికి వెళ్లారా? అంటూ విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు తీసుకొని ఇప్పుడు ఏం చేయడానికి  వెళ్లారంటూ ప్రశ్నించారు.

గత పది సంవత్సరాలలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలుగా ప్రాజెక్టుల పేరుతో తిరుగుతున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాలేజీలు భూములు కబ్జాలు చేశారే తప్ప ఏనాడైనా పాలమూరు ప్రజలకు నీళ్ల గురించి మాట్లాడారా? అందుకే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు ఓడ కొట్టారు అయినా ఇంకా వారికి తెలియడం లేదని ఆరోపించారు.  రావట్లేదు అంటూ మాజీ ఎమ్మెల్యేలపై విరుచుక పడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అందరూ కలిసి ప్రజలను పట్టించుకోకుండా విహారయాత్రలు చేస్తున్నారన్నారు.