calender_icon.png 9 January, 2026 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సర్పంచ్

09-01-2026 12:00:00 AM

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో చేరిక

కొల్లాపూర్ రూరల్ జనవరి 8 : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ దివ్యశ్రీ రంజిత్, వార్డు మెంబర్లు, పలువురు కాంగ్రెస్ పార్టీ  నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సర్పంచ్ వార్డు సభ్యులు ఇతర గ్రామస్తులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలకే పరిమితమైందని తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా, యూరియా, వ్యవసాయ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.