calender_icon.png 10 January, 2026 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీలేదు

09-01-2026 12:00:00 AM

ఆల్ ఇండియా మజిలీస్ ఈ ఇన్క్విలాబ్ ఈ మిల్లత్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహమ్మద్ ఖాజా

ముషీరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజకీయాల్లోకి రాణించేందుకు తమ పార్టీ అవకాశం కల్పిస్తుందని ఆల్ ఇండియా మజ్లీస్ ఈ ఇన్ క్విలాబ్ ఈ మిల్లత్ జాతీయ అధ్యక్షుడు కవి అబ్బాసి, జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సమీవుల్లా ఆజాద్ అన్నారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయస్సార్సీపి పార్టీకి చెందిన మహమ్మద్ కాజా ను ఆలిండియా మజిలీస్ ఈ ఇన్ క్వీ లాబ్ ఈ మిల్లత్ పార్టీలోకి కండువాను కప్పి సాధారణంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రా న్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మె ల్యే రఫత్ జహాన్ ప్రతినిధులు మహమ్మద్ బర్క త్, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ ఖాసీం, జాబేర్, ఆదామ్, షేక్ ఇబ్రహీం, సయ్యద్ అల్తాఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.