calender_icon.png 5 September, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల వద్దకు ఎమ్మెల్యే బాలు నాయక్..

03-09-2025 02:40:46 PM

మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం పేరిట

దేవరకొండ: నేరేడుగొమ్ము మండల కేంద్రంలో బుధవారం దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్(MLA Balu Naik) మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా పలు కాలనీలో పర్యటించి ప్రజలకు నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని అక్కడిక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించడం, ప్రజాక్షేత్రంలోకి అధికారులు తీసుకువెళ్లడం మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని, పేద ప్రజలకు అండగా, ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేష స్పందన ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.