calender_icon.png 5 September, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో యూరియా కోసం అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ కట్టిన రైతన్నలు..

03-09-2025 02:45:31 PM

కాల్వ శ్రీరాంపూర్ (విజయక్రాంతి): జిల్లాలో యూరియా కోసం రైతన్నలు అర్ధరాత్రి నుండి క్యూ లైన్ కట్టారు. జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం, ఓదెల, తదితర మండలాల్లో సింగిల్ విండో కార్యాలయాల్లో యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం కూనరం సహకార సంఘం వద్ద అర్ధరాత్రి నుంచి పడిగాపులు కస్తున్నారు రైతులు. మహిళా రైతులు సైతం తెల్లవారుజామున 3 గంటల నుంచి లైన్ కట్టి వున్నా యూరియా దొరకడం లేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా(Peddapalli District) కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం వ్యవసాయ సహకార సంఘం సహకార సంఘం వద్ద రాత్రి నుండే రైతులు ఎరువుల కోసం బారూలు తీరారు.

కుటుంబ సభ్యులను వదిలేసి రాత్రి నుండి యూరియా కోసం పడిగాపులు పడిగాపులు కాస్తున్నామంటూ అంత ఎదురు చూసిన ఒక బస్తా మాత్రమే ఉదయం ఇచ్చారని యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా బస్తాలు తీసుకునే దిశగా రైతులు ఒక్కసారిగా ముందుకెళ్లడంతో కిందపడ్డ మహిళలు గాయాల పాలైనరని ఇలాంటి దుస్థితి ఎదురవడం విషాదకరమంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.