calender_icon.png 5 September, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన

03-09-2025 02:37:32 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు దెబ్బతిన్న పత్తి, వరి పొలాలను బుధవారం అధికారులు పరిశీలించారు. దుగ్నెపల్లి, రంగపేట, పెర్కపెల్లి గ్రామాలలో ఏవో ప్రేమ్ కుమార్(AO Prem Kumar), ఏఈవో శ్రీను(AEO Srinu) సర్వే చేశారు. బుధఖుర్దూ, బుధక్షలన్, కన్నాల గ్రామాలలో ఏఈవో తిరుపతి సర్వే చేశారు. నష్టం శాతాన్ని అంచనా వేసి నష్టపోయిన నిజమైన రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని, ఇంకా ఎవరికైనా పంట నష్టం జరిగి సర్వే చేయించుకోనట్లయితే వెంటనే సంబంధిత ఏఈవోను గాని, తనను గాని ఫోన్ లో సంప్రదించి వివరాలు తెలపాలని వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ అన్నారు.