3 September, 2026 | 6:30 AM

మంతపురిలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మార్నింగ్ వాక్

03-09-2026 | 03:15am

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన

ఆలేరు, సెప్టెంబర్ 2: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Beerla Ilaiah) మంతపురి గ్రామంలో బుధవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారులకు బిల్లుల మంజూరు, పెండింగ్ సమస్యలపై అధికారులను ఆరా తీశారు. అర్హులైన ప్రతి లబ్ధిదా రుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామంలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తొలగింపు సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక వసతులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. జంగాల కాలనీలో భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాల్య వివాహాలపై కూడా ఎమ్మెల్యే ప్రజలకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిం డకముందు బాలికలకు వివాహం చేయడం చట్టవిరుద్ధమన్నారు. తదుపరి పలువురు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకురాగా వాటి పరిష్కారాన్ని కృషి చేస్తాన న్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పశువుల సతీష్ రెడ్డి, గంధమల అశోక్, కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, ఏజాజ్, నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు.