సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
31-08-2026 01:12 AM
నిర్మల్ ఆగస్టు 30 ( విజయ క్రాంతి) ని యోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సోన్, మామడ, లక్ష్మణచందా, సా రంగాపూర్, దిలావర్పూర్, నర్సాపూర్ మం డలాలకు చెందిన లబ్ధిదారులకు ద్వారా మంజూరైన చెక్కులను బీజేపీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారంపంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 226 మంది లబ్ధిదారులకు రూ. 56,43, 000 విలువైనచెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మండల నాయకులు, సర్పంచు లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






