పేదల అభివృద్ధ్దే కాంగ్రెస్ ధ్యేయం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి, మే 8(విజయ క్రాంతి): పేదల అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రె స్ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పదేళ్ల పాలనలో ప్రజల్ని మోసం చేసి అందినంత దండుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. వరంగల్ ఎంపీగా కడి యం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, రాహుల్ గాంధీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీకి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






