21 April, 2026 | 4:12 PM

గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఘనస్వాగతం

09-05-2024 02:36 AM

గజ్వేల్, మే 8 (విజయక్రాంతి) : మెదక్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ రోడ్‌షోకు వెళ్తు న్న మాజీ సీఎం కేసీఆర్‌కు గజ్వేల్‌లో ఘనస్వాగతం లభించింది. బుధవారం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి గజ్వేల్ మీదుగా నర్సాపూర్‌కు బస్సులో వెళ్తున్న కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతూ కేసీఆర్ బస్సుపై పూలు చల్లారు. కేసీఆర్ బస్సులో నుంచే నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ విజయసంకేతం చూ పారు. కాగా స్థానిక కౌన్సిలర్లు బబ్బూరి రజిత, బాలమణిలు కేసీఆర్‌కు విజయతిలకం దిద్దారు.